Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా: బెంగల్లోని కూచ్ బెహార్ ఎన్నికల హింస నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలో రాజకీయ నాయకుల పర్యటపై ఆంక్షలు విధించింది. రాబోయే మూడు రోజుల పాటు జిల్లాలో ప్రవేశించకుండా నిషేధం విధించింది. అలాగే ఐదో విడత ఎన్నికల ప్రచార సమయాన్ని సైతం తగ్గించింది. ఎన్నికలకు ముందు 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉండగా.. దాన్ని 72 గంటలకు పెంచింది. కాగా, కూచ్ బెహార్ జిల్లాలో చెలరేగిన హింసలో భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. హింస నేపథ్యంలో పరిస్థితులు మరింతగా దిగజారకుండా ఉండేందుకు ఈసీ ఈ నిర్ణయం తీసకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘర్షణ ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మద్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధానికి తెర లేపింది. ఈ హింస బీజేపీ ప్రణాళికాబద్దమైన దాడి అని మమతా బెనర్జీ విమర్శించగా.. హింసకు కారణం మమతనే అని బీజేపీ ఆరోపిస్తున్నది.