Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పనాజీ: ఒక మతానికి చెందిన మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఆరోపణలపై ప్రాథమిక అంశాలను పరిగణలోకి తీసుకోకుండా కొందరి మీద కేసు నమోదు చేసిన గోవా పోలీసులు తీరుపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు వారిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను న్యాయస్థానం కొట్టేసింది. గోవా రాజధాని పనాజీలో 2019 డిసెంబర్ 17న సంగీతకారులు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్లో భాగంగా ఒక వ్యక్తి పాడిన పాట తమ మత మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయనంటూ ఢిల్లీ చెందిన అడ్వకేటు కే. వెంకట కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గోవా పోలీసులు ఎలాంటి విచారణ జరపకుండానే వెంటనే తొమ్మిది మంది సంగీతకారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయంలో ఫిర్యాదుదారుకు క్షమాపణలు చెప్పాల్సిందిగా ఆ సంగీతకారులను గోవా పోలీసులకు స్టేషన్కు పిలిచారు. అయితే, ఈ విషయంలో వారు క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారు. దీనిపై సంగీతకారులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే, పౌరులను పోలీసు స్టేషన్కు పిలిచి వారిని క్షమాపణ చెప్పాలని అడగడం చేయకూడదని ఈ సందర్భంగా గోవా పోలీసుల తీరును న్యాయస్థానం తప్పుబట్టింది. సంగీతకారులపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టేస్తూ డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు ఎంఎస్ సొనాక్, ఎంఎస్ జవాల్కర్లు తీర్పునిచ్చారు. ఈ విషయంలో ప్రాథమిక అంశాలు మరిచి పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని వారు చెప్పారు.