Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో ఒక్కరోజే 1.52 లక్షల కేసులు, 839 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ తీవ్ర రూపం దాలుస్తున్నది. రికార్డు స్థాయిలో నిత్యం లక్షకు పైగా కేసులు నమోదుకావడం వైరస్ వ్యాప్తికి అద్దం పడుతోంది. తాజాగా ఒక్కరోజే లక్షన్నర మంది వైరస్ బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,52,879 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వెలుగుచూసినప్పటి నుంచి ఒక్కరోజులో దేశంలో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అలాగే, కొత్తగా 839 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,69,275కు చేరగా, పాజిటివ్ కేసుల సంఖ్య 1,33,58,805కు పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 1,20,81,443 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 11,08,087 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, దేశంలో ఇప్పటివరకు మొత్తం 25,66,26,850 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 14,12,047 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది. ఇక కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 10,15,95,147కు చేరింది. తమిళనాడు కాంగ్రెస్ నేత మాధవరావు కరోనాతో మరణించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీవిల్లిపుత్తూరు నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిలిచారు. ఎన్నికల ప్రచారంలో ఆయనకు కరోనా సోకగా.. మధు రైలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం మరింతగా విషమించడంతో మాధవరావు కన్నుమూశారు.
ఐదు రాష్ట్రాల్లోనే 70 శాతం కేసులు !
దేశంలో కొత్తగా నమోదవుతున్న కొత్త కేసుల్లో అత్యధికం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. తాజాగా వెలుగుచూసిన మొత్తం 1.52 లక్షల కేసుల్లో 70 శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే నిర్థారణ అయ్యాయి. కరోనా కేసులు అధికంగా ఉన్న టాప్-10 రాష్ట్రాల్లో పై ఐదు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో కరోనా ప్రభావం పెరు గుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలతో (500కు పైగా యాక్టివ్ కేసులు) పాటు నిత్యం వందకు పైగా కొత్త కేసులు నమోదయ్యే జిల్లాలో నైట్ కర్ప్యూ విధిం చాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. విద్యా సంస్థలు, కోచింగ్‌సెంటర్లు ఈనెలాఖరు వరకు మూసివేయాలని పేర్కొన్నారు.
సరిహద్దులు మూసేసిన ఒడిశా..
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒడిశా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావం అధికమవుతున్న ఛత్తీస్‌గఢ్‌తో ఉన్న సరిహ ద్దులను మూసివేసింది. పొరుగు ప్రాంతాల నుంచి ప్రజలు రాష్ట్రంలోకి రావాలంటే కరోనా నెగటివ్ సర్టిఫికేట్ చూపించాలని స్పష్టం చేసింది.