Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
సుప్రీంకోర్టులో సేవలు అందిస్తున్న సగం మంది ఉద్యోగులకు కరోనా సోకినట్టు కోర్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో కోర్టు లోపలా, బయట ప్రాంతాలను పూర్తిగా శానిటైజ్ చేసినట్టు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ కార్యాలయం సోమవారం మీడియాకు తెలిపారు. ఈ పరిణామం తమ రోజువారీ పనికి ఆటంకం కలగించదని సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి చంద్రచూడ్ పేర్కొన్నారు. కోర్టులోని 90 మంది ఉద్యోగుల్లోని 44 మందికి కరోనా వచ్చినట్టు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్(వీసీ) ద్వారా కేసులను విచారణ చేస్తామన్నారు. దీనికి సంబంధించి 16 వివిధ ధర్మాసనాల్లో 1600 వీడియో కాన్ఫరెన్స్(వీసీ) లింకులు అందుబాటులో ఉన్నట్టు చంద్రచూడ్ చెప్పారు. గడచిన వారంరోజుల్లోనే సుమారు 10 లక్షల కొత్త కరోనా నమోదు కావడంతో ఆందోళనకలిగిస్తున్నదని తెలిపారు.