Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆందోళనకు ఎస్కేఎం పిలుపు
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దళిత హక్కుల కార్యకర్త, రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14న, బుధవారం) రోజున దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లోని రైతాంగ ఉద్యమ కేంద్రాల్లో రైతులు, బహుజనులు పెద్ద ఎత్తున తరలిరావాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) పిలుపు నిచ్చింది. రైతులు, రైతు కూలీలు, బహుజన ప్రజానీకం పెద్దఎత్తున తరలివచ్చి మన ఐక్యమత్యాన్ని నిరంకుశ మోడీ సర్కారుకు చూపించాలని స్పష్టం చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా తీసుకువచ్చిన మూడు సాగు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దుచేయాలనీ, కనీస మద్ధతు ధర(ఎంఎస్పీ) కల్పించాలన్న డిమాండుతో సాగుతున్న దేశవ్యాప్త రైతాంగ ఉద్యమం సోమవారానికి 137వ రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా రానున్న రెండు రోజుల కార్యక్రమాలపై సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) సమన్వయకర్త దర్శన్ పాల్ వివరించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఏప్రిల్ 14వ తేదీన రాజ్యాంగ పరిరక్షణ దినంతో పాటు కిసాన్-బహుజన్ ఏక్తా దివస్‌ను రైతు ఉద్యమ కేంద్రాలతో పాటు దేశవ్యాప్తంగా నిర్వహి స్తామని చెప్పారు. బహుజన సంఘాలకు సంబంధించిన నేతలు, ప్రతి నిధులు అంబేద్కర్ జయంతి రోజు సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌లోని అన్నదా తల ఆందోళన శిబిరాలవద్దకు వచ్చి సంఘీభావం తెలుపుతారన్నారు. బడుగువర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ తన జీవితాంతం పోరాటం చేశారని వివరించారు. తాజాగా మోడీ సర్కారు రూపొందించిన రైతు చట్టా లు కూడా భారత కర్షకలోకాన్ని బ్రిటిష్ పాలనలో జరిగిన దోపిడీ కాలానికి నెట్టేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే వీటికి వ్యతిరేకంగా రైతు లు పోరాడుతున్నారని తెలిపారు. రైతు కూలీల్లో చాలామంది బహుజ నవర్గానికి చెందిన ప్రజనీకమేనని దర్శన్ పాల్ గుర్తు చేశారు. కాగా, తమ కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.