Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యవర్తికి ముడుపులపై పిల్ స్వీకరణ
న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో ఇటీవల వెలుగు చూసిన 'దళారీ' కుంభకోణానికి సంబంధించి దాఖలైన కొత్త పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. రెండు వారాల్లోగా ఈ పిల్‌పై విచారణ చేపడుతామని పేర్కొంది. భారత్, ఫ్రాన్స్‌ల మధ్య 2016లో జరిగిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ఏవియేషన్ మేజర్ డస్సాల్ట్ ద్వారా భారత్‌లోని ఒక మధ్యవర్తికి 1.1మిలియన్ యూరోలు చెల్లించిన స్కాం వెలుగు లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)ను విచారణకు స్వీకరించాలన్న న్యాయవాది అభ్యర్థనపై స్పందించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. జెట్ల 50మోడెల్స్ను అందించిన భారత్‌కు చెందిన డెఫ్సిస్ సొల్యూషన్స్ అనే సంస్థకు బహుమతి కింద డస్సాల్ట్ ఏవియేషన్ ఒక మిలియన్ యూరోలు చెల్లిం చినట్టు అవినీతి నిరోధక శాఖ దర్యాప్తులో వెల్లడైందని.. ఫ్రెంచ్ పత్రిక మీడియా పార్ట్‌లో ప్రచురించింది. డెఫ్సిస్ సొల్యూషన్స్ సంస్థను యజమాని సుషేన్ గుప్తా ఇప్పటికే అగస్టా వెస్ట్‌లాండ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు.