Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దలాల్ స్ట్రీట్ పై కరోనా పంజా
- సెన్సెక్స్ 1708 పాయింట్లు ఫట్
- ఇంట్రాడేలో 1900 పాయింట్లు క్రాష్
ముంబయి : దేశంలో కరోనా రెండో దశ వేగంగా విజృంభించడంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ సంకేతాలు... ఆర్థిక మందగమనం మరింత తీవ్రం కావొచ్చన్న భయాలు..వెరసి దలాల్ స్ట్రీట్ తీవ్ర ఒత్తిడికి గురైంది. అమ్మకాల ఒత్తిడితో సోమవారం సెషన్లో బీఎస్ఈ సెన్సెక్స్ 1,708 పాయింట్లు లేదా 3.5 శాతం పతనమై 47,883కు పడిపోయింది. ఇదే బాటలో ఎన్ఎస్ఇ నిఫ్టీ 524 పాయింట్లు క్షీణించి 14,311 వద్ద ముగిసింది. మార్కెట్లు ప్రారంభం అయినా కొద్ది క్షణాల నుంచే అమ్మకాల పరంపరం కొనసాగడంతో మదుపర్ల సంపద లక్షల కోట్లు ఆవిరైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 1900 పాయింట్లు, నిఫ్టీ 590 పాయింట్ల చొప్పున పతనమయ్యాయి. ఈ దెబ్బతో ఒక్క పూటలోనే మదుపర్లు రూ.8.69 లక్షల కోట్లు నష్టపోయారు. ఓ దశలో కేవలం 15 నిమిషాల్లోనే రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. తుదకు బీఎస్ఈ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.2.01 లక్షల కోట్లకు పడిపోయింది. నిఫ్టీలో అన్ని రంగాలు నేల చూపులు చూశాయి. పీఎస్యూ బ్యాంకింగ్ సూచీ 9 శాతం, రియాల్టీ 7 శాతం చొప్పున అత్యధికంగా పతనం కాగా.. ప్రయివేటు బ్యాంక్లు, లోహ, ఆటో సూచీలు 5 నుంచి 6 శాతం మేర విలువ కోల్పోయాయి. సెన్సెక్స్ -30లో కేవలం ఒక్క సూచీ డాక్టర్ రెడ్డీస్ మాత్రమే 7.04 శాతం పెరిగింది. మిగితా 29 స్టాక్స్ విలువ కోల్పోయాయి. ఇండుస్ఇండ్ బ్యాంక్ 8.54 శాతం, బజాజ్ ఫినాన్స్7.25 శాతం, ఎస్బీఐఎన్ 6.33 శాతం, ఓఎన్జీసీ 5.20 శాతం, టైటాన్ 5.14 శాతం చొప్పున అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.