Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50-70శాతం సోకుతున్న సెకండ్‌వేవ్
- కరోనా మరణాలకు కారణం..
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌వేవ్ విరుచుకు పడుతున్నది. ఇది ఊపిరితిత్తులకు సంక్రమణ నష్టం చాలా వేగంగా ఉంటున్నదని నిపుణులు గుర్తించారు. కరోనా ఇన్ఫెక్షన్ 2-3 రోజులలో 50-70 శాతం ఊపిరితిత్తులకు సోకుతుంది.కనీసం ఏడురోజులకు వైరస్ కోరలు చాస్తుంటే..తాజాగా కేవలం రెండుమూడు రోజుల్లోనే ఊపిరి తిత్తులను దెబ్బతీయటంతో.. మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నదని వైద్యవర్గాలు అంచనాకొచ్చాయి.
సంక్రమణ గుర్తించేలోపే..హాని
సాధారణంగా, కరోనా సంక్రమణకు రోగి నిర్ధారించడానికి రెండు, మూడు రోజులు పడుతుంది. యాంటిజెన్ పరీక్షలు,ఆర్టీ పీసీఆర్,సీటీ స్కాన్లు రిపోర్టు వచ్చేవరకు 24 నుంచి 36 గంటల సమయం పడుతుంది. అప్పటికే ఊపిరితిత్తులను ఇన్ఫెక్షన్ దెబ్బతీస్తుంది. అతి వేగంగా 50-70 శాతానికి విస్తరిస్తున్నది.పల్మోనాలజిస్ట్ ప్రకారం... ప్రతిరోజూ 2-3 సిగరెట్లు తాగడం వల్ల 20 ఏండ్లకు కలిగే హాని కంటే..కేవలం2-3 రోజుల్లో ఊపిరితిత్తులకు వైరస్ చేరుతుందని వైద్యులు పరిశోధనల్లో గుర్తించారు.