Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్ ఒకటిన కేరళ తాకనున్న నైరుతి పవనాలు : స్కైమెట్
న్యూఢిల్లీ: కరోనాలోనూ రైతులకు శుభవార్త . ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే రుతుపవనాలు సాధారణం కంటే మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు భారతదేశంలో సగటు వర్షపాతం 907 మిల్లీమీటర్లు ఉంటుందని వాతావరణ సమాచార సంస్థ స్కైమెట్ వెదర్ సర్వీసెస్ తెలిపింది.దేశమంతటా నాలుగు నెలల్లో సగటు వర్షపాతం 880.6 మిల్లీమీటర్లు, దీనిని లాంగ్ పీరియడ్ యావరేజ్ (ఎల్పీఏ)అంటారు. స్కైమెట్ అంచనా ప్రకారం ఈ ఏడాది 907 మి.మీ వర్షం కురిసే అవకాశం ఉన్నది. 2021 వర్షాకాలంలో 103శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా. సాధారణ వర్షపాతం కంటే 96 శాతం నుంచి 104శాతం వరకు వర్షపాతం కురిసే అవకాశాలున్నాయి. 2019 లో 110 శాతం నమోదుకాగా, 2020 109శాతం. 2021 వరుసగా మూడో ఏటా రుతుపవనాల ప్రయోజనం లభిస్తుందని స్కైమెట్ అంచనా వేసింది.
ఈశాన్యం, కర్నాటకలో తక్కువ వర్షపాతం
ఈ ఏడాది జూన్‌లో 177 మి.మీ వర్షం కురవవచ్చనీ, జులైలో 277, ఆగస్టులో 258, సెప్టెంబర్‌లో 197 మి.మీ వర్షం కురిసే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ప్రత్యేక విషయం ఏమిటంటే, గత సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో, ఈసారి మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. జూన్‌లో బీహార్, పశ్చిమ బెంగాల్లో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. జులైలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మంచి వర్షాలు కురుస్తాయి, ఈశాన్య, కర్నాటక రాష్ట్రాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. ఇక మధ్యప్రదేశ్‌తో సహా ఇతర రాష్ట్రాలు, మహారాష్ట్ర వంటి దేశంలోని పశ్చిమ ప్రాంతాలు సెప్టెంబర్‌లో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం కూడా జూన్ మొదటి వారం నుంచి ముంబయిలో వర్షాలు ప్రారంభమవుతాయి.
వ్యవసాయంపై ప్రభావాన్ని చూపనున్న రుతుపవనాలు
రుతుపవనాలు సకాలంలో రాకతో.. వ్యవసాయాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. గతేడాది వర్షాల కారణంగా, రబీ పంట విత్తడం రికార్డు స్థాయికి చేరాయి. క్రిసిల్ ప్రకారం, 2020 నవంబర్ 27 వరకు ఈ సీజన్లో మొత్తం 348 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేశారు. అంతకుముందు సీజన్లో 334 లక్షల హెక్టార్లతో పోలిస్తే. గత ఐదేండ్ల సగటు కంటే నాలుగు శాతం,రెండు శాతం పెరుగుదల కనిపించింది.