Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా ట్రీట్మెంట్కు ఇంటికి రావాలని ఒత్తిడి
- ప్రధానికి లేఖ రాసిన వైద్యులు
న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న రాజకీయ నేతల వీఐపీ సంస్కృతి వైద్యులను మరింతగా ఇబ్బందులకు గురిచేస్తోందని ఇటీవలే పలు రిపోర్టుల ద్వారా వెల్లడైంది. తాజాగా ఇదే విషయంపై.. కరోనా ట్రీట్మెంట్ కోసం ఇంటికి రావాలంటూ ప్రభుత్వ వైద్యులకు రాజకీయ నేతలు బెదిరించడాన్ని అఖిల భారత వైద్య సంఘం (ఫైమా) తప్పుబట్టింది. ఈ మేరకు నేతల వీఐపీ సంస్కృతిపై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసింది. కరోనా కారణంగా ఆస్పత్రుల్లో చేరుతున్న వీఐపీలు తమను ఇంటికి వచ్చి చికిత్స చేయాలని వేధింపులకు గురిచేస్తున్నారని డాక్టర్ల సంఘం ప్రధాని మోడీకి చేసిన ఫిర్యాదులో పేర్కొంది. ఓవైపు ఫ్రంట్లైన్ వర్కర్లుగా ఉన్న తమకే ఆస్పత్రులో పూర్తి స్థాయిలో సదుపాయాలు లేవనీ, తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ రాజకీయ నేతలకు, వారితో పాటు ఉండే కార్యకర్తలకు చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఆస్పత్రుల్లో వీఐపీలకు ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయనీ, కానీ డాక్టర్లకు మాత్రం లేవని వారు తెలిపారు.
కాగా, చాలా మంది రాజకీయ నేతలు, వీఐపీలు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపో యినా తమను ఇండ్లకు వచ్చి చికిత్స అందించాలని డిమాండ్ చేస్తున్నారని వైద్యుల సంఘం ప్రధానికి రాసిన లేఖలో వివరించింది. దేశంలో నిత్యం లక్షల్లో కేసులు బయటపడుతుండగా.. ఇందులో చాలా మంది రాజకీయ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఉంటున్నారు.