Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: మహారాష్ట్రలో లాక్డౌన్పై ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించడం లేదని చెప్పారు. ముంబయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉద్ధవ్ వివరించారు. కొవిడ్ తీవ్రత దృష్ట్యా బుధవారం రాత్రి 8 గంటల నుంచి లాక్డౌన్ తరహా ఆంక్షలుంటాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 15రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ''మహారాష్ట్రలో కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరత ఉన్నది. రెమిడెసివిర్ ఔషధానికి డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు క్రమంగా పెంచుతున్నాం. కొవిడ్ టీకాల సరఫరాను కేంద్రం మరింత పెంచాలి. తక్షణం ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తిని వైద్య అవసరాలకే వాడాలి. అవసరమైతేనే ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలి. అత్యవసర సేవలకే ప్రజారవాణా వాడాలి. అవసరం లేకుండా ప్రయాణాలు చేయొద్దు'' అని ఉద్ధవ్ సూచించారు.