Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కరోనా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. మంగళవారం కొత్తగా 1,61,736 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే అత్యధిక కేసులు నమొదు అయిన జాబితాలో మన దేశం రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కేసుల నమోదులో అమెరికా కంటే భారత్ ముందు ఉన్నదని పలు యూనివర్సిటీలు చెబుతున్నాయి.
కరోనాకు సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం సోమవారం 97,168 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,36,89,453 కు చేరింది. గడచిన 24 గంటలో 879 మంది కరోనా కారణంగా మతి చెందారు. దీంతో కరోనా మతుల సంఖ్య 1,71,058కు పెరిగింది. కరోనా నుంచి దేశంలో ఇప్పటివరకు 1,22,53,697 మంది కోలుకున్నారు. 12,64,698 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హౌం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 10,85,33,085 మందికి వ్యాక్సిన్లు అందించారు.
మరో కేంద్ర మంత్రికి పాజిటివ్
ఇప్పటికే పలువురు మంత్రులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో కేంద్ర మంత్రి చేరారు. తాజాగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. ''నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోండి. కరోనా జాగ్రత్తలు పాటించండి. అందరం కలిసి కరోనా ను జయించుదాం.'' అని సంతోష్ గంగ్వార్ పేర్కొన్నారు.
ఐసోలేషన్లోకి యూపీ సీఎం
తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఆయన కార్యాలయంలో కొంత మందికి కరోనా సోకింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ట్విట్టర్ వేదికగా సీఎం వెల్లడించారు. కాగా, యూపీలో 18021 కేసులు, 85కు మరణాలు నమోదయ్యాయి.