Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గడ్, బీహార్లో ఆపరేషన్ ప్రహార్ పేరుతో మావోయిస్టులను హతమార్చడాన్ని నిరసిస్తూ ఈనెల 26న మావో యిస్టుపార్టీ భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఈనెల 1 నుండి 25వ తేదీ వరకు ప్రజా ఉద్యమాల నెలగా పాటిస్తున్నామని, అలాగే శాంతియుత చర్చల కు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు అధికార ప్రతినిధి రెండుపేజీల లేఖలో ప్రకటించారు. అయితే.. సాయుధ పోరాటాన్ని వీడితేనే చర్చలంటూ ప్రభు త్వం షరతులు పెట్టడాన్ని లేఖలో ఖండించారు. చర్చలను మంచి వాతా వరణంలో జరపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ఓవైపు పోలీసులు, మరోవైపు జవాన్లు.. వీరి మరణాలకు ప్రభుత్వానిదే బాధ్య తన్నారు. ఈ మరణాల పట్ల మావోయిస్టు కేంద్ర కమిటీ విచారం వ్యక్తం చేసింది. అలాగే తాము చేపట్టిన బంద్కు అన్నివర్గాల మద్దతును కోరింది.