Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పశ్చిమబెంగాల్ ఎన్నికలపై కరోనా నీడలు
- సామాజికదూరం, మాస్కులు లేకుండానే ర్యాలీలు
- ప్రచారాల్లో ప్రధాని,కేంద్ర హౌం మంత్రి బిజీబిజీ
- కోల్‌కతాలో ఐదువేలకు చేరువలో కోవిడ్-19 కేసులు
కోల్‌కతా: దేశంలో కరోనా సెకండ్‌వేవ్ విరుచుకుపడుతుంటే మోడీ ప్రభుత్వం మాత్రం పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో గెలిస్తే చాలు అన్నతీరుగా వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశప్రధాని మోడీ, కేంద్రహౌంమంత్రి అమిత్‌షా రోడ్‌షోలు,ర్యాలీలు నిర్వహిస్తున్నారు. భారీసంఖ్యలో కార్యకర్తలు తరలివస్తుంటే.. వారిలో వేళ్లమీద లెక్కపెట్టేవిధంగా మాస్క్‌లు ధరిస్తున్నారు. మిగతా అందరూ సామాజికదూరం,మాస్కులు లేకుండానే ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. ఓవైపు కోల్‌కతాలోనే కోవిడ్ కేసులు ఐదువేలకు చేరుకుంటుంటే..అక్కడి ఓటర్లలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్ నిబంధనల్ని ఆచరించాల్సిన దేశప్రధాని, కేంద్రహౌం శాఖమంత్రి ఇవేం పట్టించుకోవటంలేదు. ఎన్నికలగోదా లోకి దిగి వారిద్దరూ సుడిగాలిపర్యటనలు చేస్తున్నారు. సరిగ్గా ఏడాది కిందట కరోనా విజృంభిస్తే..మొబైల్ లైట్లు వెలిగించాలనీ,చప్పట్లు కొడితే కరోనా దరికి చేరదని కేంద్రపాలకులు చెప్పుకొచ్చారు. అంతే కాదు గో కరోనా గో కరోనా అన్న బీజేపీ నేతలకూ పాజిటివ్ వచ్చింది.ఇప్పటివరకూ మోడీ ప్రభుత్వం కోవిడ్‌ను ఏవిధంగా నియంత్రించాలో తెలియక తర్జనభర్జనపడుతున్నది. పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బిజీగా ఉన్న దేశప్రధాని మోడీ మన్‌కీబాత్ కార్యక్రమంలో
మాత్రం కరోనా కట్టడికి మాస్కులేనంటూ చెబుతున్నారు. కానీ ప్రచారాల్లో మాత్రం సామాజిక దూరం,మాస్కులు ధరించాలని ఒక్కసారి కూడా కోరకపోవటం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా సెకండ్‌వేవ్ వచ్చినా సమర్థం గా ఎదుర్కోవటమెలా? అన్నది మోడీ ప్రభుత్వానికి బోధ పడటంలేదు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షన్న రకు పైగా కేసులు నమోదవుతుంటే..సుమారు వెయ్యివరకు కరోనా మరణాలు సంభవిస్తుంటే... కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ లైట్ తీసుకుంటున్నదనే వాదన వినిపిస్తున్నది.
బీజేపీ కార్యాలయానికి కరోనా వ్యాక్సిన్
దేశానికే గుజరాత్ మోడల్ అంటూ ఊదరగొట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఆ రాష్ట్రంలో కరోనా మరణమృదంగం మోగుతున్నది. సూరత్ శవాలగుట్టగా మారితే.. అంత్యక్రి యలు నిర్వహించే ఎలక్ట్రిక్ చిమ్నిలు కూడా ఆ వేడికి కరిగిపో తున్నాయి. మరోవైపు తమప్రాణాలను కాపాడుకోవాలనే ఆశతో ఎందరో పేదప్రజలు వ్యాక్సినేషన్‌కోసం క్యూ కడుతున్నారు. కానీ వీరిని కాదని ఐదువేల డోసులు బీజేపీ కార్యాలయానికి తరలించారు.
ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ఆర్ పాటిల్ వ్యాక్సినేషన్ తీసుకెళ్లిన విషయంపై అక్కడి ముఖ్యమంత్రి విజరురూపానీని ప్రశ్నిస్తే... పాటిల్‌నే అడగండంటూ ఎదురు సమాధానమివ్వటం కొసమెరుపు. ఎందుకంటే పాటిల్... మోడీ అనుచరుడు, రూపానీ అమిత్‌షా గ్రూపునకు చెందిన వాడు కావటమేనని మీడియాలో చర్చకొచ్చింది.
గుజరాత్ హైకోర్టు ఏమన్నదంటే..
రాష్ట్రంలోని కోవిడ్ -19 పరిస్థితి... వాస్తవికతకు ప్రభుత్వ వాదనలకు విరుద్ధంగా ఉన్నదని గుజరాత్ హైకోర్టు అభిప్రాయపడింది.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విక్రమ్ నాథ్, జస్టిస్ భార్గవ కరియాలతో కూడిన ధర్మాసనం, రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిని సుమోటో కాగ్నిజెన్స్ తీసుకుంటూ, పిఐఎల్పై, '' ఇప్పుడు దేవుని దయతో బతకట మేనా అని ప్రజలు భావిస్తున్నారు '' అని వ్యాఖ్యానించింది. కోవిడ్ -19 పరిస్థితిని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి అడ్వకేట్ జనరల్ కమల్ త్రివేది హైకోర్టుకు తెలియజేసినపుడు పై విధంగా కోర్టు అభిప్రాయ పడింది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించిన విచా రణ సందర్భంగా అంతా బాగానే ఉన్నదని మీరు చెబుతు న్నారు, కాని వాస్తవికత దీనికి విరుద్ధమంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి అడ్వకేట్ జనరల్ త్రివేదితో మాట్లాడుతూ, ''గుజరాత్లో రెమెడిస్విర్ మందు తగినంత సరఫరా ఉన్నదని మాకు తెలుసు. ప్రభుత్వం తరపున మాట్లాడమని అడిగిన విషయాలు మాత్రమే చెప్పకండి. మీరు మొదట ఈ కోర్టు అధికారి. ఒక వ్యక్తికి ఆర్టీ-పీసీఆర్ దర్యాప్తు నివేదిక రావడానికి ఐదు రోజులు పడుతుందని కోర్టు తెలిపింది. 'మీకు సమయం దొరికినప్పుడు మీరు దర్యాప్తు కేంద్రాలను విస్తరించలేదు' అని ధర్మాసనం ఆక్షేపించింది.
'రాష్ట్రం బాగా పనిచేయడం లేదని కేంద్రం భావిస్తే, వారు ఎందుకు జోక్యం చేసుకోలేరు' అంటూ హైకోర్టు... సర్కారు తరఫు న్యాయవాదిని నిలదీసింది. బుధవారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ కేసు తదుపరి విచారణ గురువారం జరగను న్నది. కాగా ఇప్పటికే గుజరాత్లో మూడున్నరలక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
యూపీలో వ్యాక్సిన్ కోసం వెళితే రేబీస్ ఇంజక్షన్...
యూపీలో కరోనా తీవ్రంగా ఉండటంతో..షామ్లీ ప్రాంతా నికి చెందిన ఓ మహిళ సర్కారు దవాఖానాకు వెళ్లింది. వ్యాక్సిన్ వేయమంటే...ఆమెకు రేబీస్ ఇంజక్షన్ వేశారు. ఈ మందు కుక్కకరిచిన వారికి వేసేదని ఆమె గుర్తించి నిలదీసింది. అప్పటికే ముగ్గురు మహిళలకు రేబీస్ ఇంజక్షన్ వేసి పంపారు. దీనిపై అధికారులను ప్రశ్నించగా.. పొర పాటైందని సముదాయించే ప్రయత్నం చేయటం విశేషం. అయితే మోడీ ప్రభుత్వానికి మాత్రం ఎన్నికలొస్తే..కరోనా గిరోనా జాన్తానై..పెట్రోధరలు పెంచరు.
గ్యాస్ ధరలు ఆపేస్తారు. ఫలితాలు రాగానే బాదేయటం సర్వసాధారణ మేనని ప్రజాసంఘాల నాయకులు అంటున్నారు. కానీ కరోనా విజృంభిస్తున్న వేళ..కరోనా మార్గదర్శకాలిచ్చే కేంద్ర, కేంద్రఎన్నికల సంఘానికి ప్రచారాల్లో తుంగలో తొక్కుతున్న నిబంధనలు కనిపించవా..అని దేశప్రజలు ప్రశ్నిస్తున్నారు.
రోగం ఇక్కడ.. మందు విదేశాలకు..
రోగులు ఎక్కడ ఉంటారో..వారికోసం వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలి. కానీ మోడీ ప్రభుత్వం దేశం, దేశప్రజలు అన్న సంగతి మర్చిపోయినట్టుంది. విదేశాలకు వ్యాక్సిన్‌ను తరలించింది. రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత ఉన్నదని మొత్తుకుంటున్నా..విదేశాలతో సత్సంబంధాలే ముఖ్యమన్నట్టుగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిం చింది. వాస్తవానికి దీనివెనుక దాగిన మర్మం ఏమిటంటే..ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఉద్యమంతో మోడీ ప్రభుత్వానికి విదేశాల్లో నిరసలు వెల్లువెత్తాయి. ఆయా దేశాల ప్రధానులు, అధ్యక్షులు కూడా మోడీ తీరును నిలదీశారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ బయోటెక్స్ సంస్థ తయారుచేసిన వ్యాక్సిన్‌ను విదేశాలకు ఎగుమతిచేశారు. కానీ ఇక్కడి రోగులను గురించి మాత్రం పట్టించుకోవటంలేదన్న అభిప్రాయం సర్వత్రావ్యక్తమవుతున్నది. కాగా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన హడావుడిగా విదేశీ వ్యాక్సిన్లకు కేంద్రం గ్రీన్ సిగల్ ఇచ్చింది