Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇతర మత ప్రదేశాలకు లేని నిబంధనావళి అక్కడెందుకు : ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ : 'మర్కజ్'లో ముస్లిం మత ప్రచారకుల ప్రవేశంపై నిబంధనలు విధించాలన్న కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టింది. ఇతర మతప్రదేశాల్లో లేని నిబంధనలు మర్కజ్లో ఎందుకు తీసుకువచ్చారు? అని ప్రశ్నించింది. నిజాముద్దీన్ మర్కజ్ ఆవరణలో రం జాన్ సందర్భంగా అక్కడ ప్రార్ధన చేసుకోవడానికి ఢిల్లీ పోలీసులు 200మందితో కూడిన ఒక జాబితాను రూపొందించింది. దీని ప్రకారం ఒకమారు 20మందిని మాత్రమే అనుమతించాలని కేంద్రం, ఢిల్లీ పోలీసులు ఒక నిబంధనావళిని రూపొందించాయి. దీనిని ఢిల్లీ హైకోర్టు తిరస్కరిం చింది. మసీదు, గుడి, చర్చీకి వెళ్లాలనుకునేవారు ఎవరైనా వెళ్లొచ్చని, కొద్ది మంది మాత్రమే వెళ్లాలని ఎక్కడా జాబితా రూపొందించలేదని జస్టిస్ ముక్తా గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. '' కాకపోతే భౌతిక దూరం నిబంధనలు పాటించాలంటే మర్కజ్ ఆవరణ ఎంతమందికి సరిపోతుందో.. ఆ లెక్క చెప్పండి. విడతల వారీగా మర్కజ్ ఆవరణలోకి ప్రవేశం కల్పించవచ్చు. ఎవరూ తమ పేరు ఇవ్వాల్సిన పనిలేదు'' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గత ఏడాది కరోనా సమయంలో మర్కజ్లో తబ్లిగీ జమాత్ మత సదస్సు జరిగిన నేపథ్యంలో, అక్కడ్నుంచీ కరోనా వ్యాప్తిచెందుతుందన్న అనుమానంతో ఢిల్లీ పోలీసులు ఆ ప్రాంతాన్ని నాలుగువైపుల నుంచీ మూసేశారు. బయటివారిని అక్కడికి అనుమతించటం లేదు. దీనిపై ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. నిజాముద్దీన్ మర్కజ్లో పోలీసుల నిర్బంధాన్ని ఎత్తేయాలని కోర్టును కోరింది.