Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట్న : బీహార్‌లో దళితుడికి దారుణమైన అవమానం జరిగింది. ప్రేమ వ్యవహారంలో పంచాయతీ పెద్దలు ఆ యువకుడికి అమానవీయమైన శిక్షను విధించారు. నేలపై ఉమ్మి ఆ ఉమ్మును నాకాలనీ, మూత్రం తాగాలని బలవంతం చేశారు. ఈ దారుణమైన ఘటన గయాలోని వాజిర్గంజ్లో చోటు చేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. తాను ప్రేమించిన యువతితో సదరు బాధితుడు వెళ్లిపోతుండగా.. యువతి కుటుంబీకులు అడ్డుకున్నారు. అనం తరం ఆ బాధితుడుని పంచాయతీ పెద్దల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సర్పంచ్‌తో సహా పంచాయతీ పెద్దలు యువకుడికి అసభ్యకర రీతిలో శిక్షను విధించారు. బాధితుడితో నేల పైన ఉమ్మించి.. నాకించారు. అలాగే, మూత్రం తాగించారు. బాధితుడితో బలవంతంగా విధించిన ఈ శిక్షకు సంబంధించిన ప్రతి ఒక్క దృశ్యం షాకింగ్ గురి చేసేలా ఉన్నది. ఈ విషయం గయా పోలీసులకు చేరింది. దీంతో పోలీసులు ఈ ఘటనతో సంబంధం ఉన్న ఆరుగురిని అరెస్టు చేశారు.