Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులను కట్టడి చేయడానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న స్థానిక లాక్డౌన్ నిబంధనల వల్ల ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లుతుందని బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ పేర్కొంది. ప్రతీ వారానికి సగటున 1.25 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.9300 కోట్లు) నష్టం జరుగుతుందని అంచనా వేసింది. దీని వల్ల ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగియనున్న తొలి త్రైమాసికంలో సాధారణ జీడీపీలో 140 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చని పేర్కొంది. భారత్‌లో నమోదవుతున్న మొత్తం కరోనా కేసుల్లో కేవలం ఎనిమిది రాష్ట్రాల్లోనే 81 శాతంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాలన్నీ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకంగా ఉన్నాయి.