Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్కానియా అంతర్గత నివేదిక పత్రాల్లో బహిర్గతం
న్యూఢిల్లీ : స్వీడన్ ఆటోమొబైల్ తయారీ సంస్థ స్కానియా నుంచి లగ్జరీ బస్సును వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అందుకున్నట్టు ఇటీవల వచ్చిన వార్తలు వాస్తవమేనని తేలింది. ఆ కంపనీ అంతర్గత దర్యాప్తు నివేదిక పత్రాల ఆధారంగా గడ్కరీ కుమారులు నిఖిల్ గడ్కరీ, సారంగ్ గడ్కరీలకు ఇందులో ప్రమేయం ఉన్నట్టు తేలింది. స్కానియా 2013 నుంచి 2016 మధ్య భారత్‌లోని ఏడు రాష్ట్రాల్లో బస్సు కాంట్రాక్టులు పొందడానికి లంచాలు ఇచ్చినట్టు స్వీడన్ మీడియా చానెల్ ఎస్వీటీ సహా మూడు మీడియా సంస్థలు నెల రోజుల క్రితం కథనాలను ప్రచురించాయి. కాగా, అందులో వాస్తవంలే దంటూ అప్పట్లో గడ్కరీ కొట్టిపారేశారు. తాజాగా అంతర్గత దర్యాప్తులో వెల్లడైన పత్రాల్లో ఒక స్పెషల్ లగ్జరీ బస్సును గడ్కరీ కూతురి పెళ్లికి ఇచ్చారనీ, దానికి పూర్తిగా చెల్లింపులు కూడా జరపలేదని తెలిపింది. దేశంలోని ఏడు రాష్ట్రాల్లోని బస్సు కాంట్రాక్టుల కోసం క్విడ్ ప్రో కోగా గడ్కరీకి స్కానియా ఈ వాహనం ఇచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.
స్కానియా ఇండియా , గడ్కరీ కుటుంబం మధ్య సంబంధం
స్కానియా ఇండియా మాజీ సేల్స్ డైరెక్టర్ శివకుమార్
విశ్వంతో నితిన్ గడ్కరీ ఇద్దరు కుమారుల మధ్య ఈఒప్పందానికి సంబం ధించి జూన్ 2015లో చర్చలు ప్రారంభమయ్యాయి. 2016 డిసెంబర్లో గడ్కరీ కుమార్తె పెండ్లి కోసం వాహనాన్ని నాగ్‌పూర్‌లో అందించినట్టు తాజా నివేదిక ఆడిట్ పేర్కొంది. ఈ 18 నెలల మధ్య కాలంలో, బస్సును పరిశీలించడానికి సారంగ్ గడ్కరీ బెంగళూరులోని స్కానియా కర్మాగా రాన్ని సందర్శించారు. భారతదేశంలోని స్వీడిష్ కంపెనీ అధికారులతో కలిసి... ప్రత్యక్షంగా చర్చలు జరిపినట్టు మీడియా నివేదిక తెలిపింది.
నాగపూర్ గ్రీన్ బస్ ప్రాజెక్ట్ ఏంటి?
మున్సిపాలిటీల్లో ఇథనాల్‌తో నడిచే బస్సులను తిప్పడానికి నాగపూర్ గ్రీన్ బస్ ప్రాజెక్ట్ రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ కింద అన్ని సిటీ బస్సులను జీవ ఇంధనంతోనే నడపాలి. బెల్లంతోనే కాకుండా, వరి, గోధుమ గడ్డి, వెదురుతో కూడా ఇథనాల్ తయారు చేసేలా ఇలాంటి పథకాన్ని తీసుకొస్తున్నట్లు 2016లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించిన సమయంలో నితిన్ గడ్కరీ అన్నారు.
ఈ ప్రాజెక్ట్ కింద నడపడానికి స్వీడన్ కంపెనీ స్కానియా ఇథనాల్‌తో నడిచే 55 బస్సులు సిద్ధం చేసింది. కానీ 2018లో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. నాగపూర్ మునిసిపల్ కార్పొరేషన్ నుంచి 25 గ్రీన్ బస్సుల బకాయిలు రాకపోవడంతో దీనిని ఆపేస్తున్నట్లు స్కానియా చెప్పింది.