Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాతావారణ శాఖ హెచ్చరిక
తిరువనంతపురం : ఈ నెల 18 వరకూ కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ బుధవారం ప్రకటించింది. ఆ రాష్ట్రంలో రెండు మూడు చోట్ల అతి భారీ వర్షాలు (24 గంటల్లో 7 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీమీటర్లు) పడే అవకాశముందని హెచ్చరించింది. తిరువనంత పురం, ఇడుక్కి, పాలక్కడ్, మలప్పురం, కొజికొడ్, వాయనడ్, కన్నూర్, పథనంతిట్ట, త్రిస్సూర్ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఈ నెల 18 వరకూ రాష్ట్రంలో ఈ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లోనూ ఒక మోస్టరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.