Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్ గాంధీ
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ బుధవారం మొదటిసారిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ, టీఎంసీ రెండు పార్టీల సిద్ధాంతాలు ఒకటేనని, విభజన రాజకీయాలకు పాల్పతాయని విమర్శించారు. ఎనిమిది దశల పోలింగ్‌లో నాలుగుదశలు ముగిశాయని.. అయినా బీజేపీకి గెలిచే అవకాశం లేదని అన్నారు.
మీరు తృణమూల్‌కు అవకాశం ఇచ్చారు. కానీ అది విఫలమైంది, మమతా బెనర్జీ రోడ్లు, కళాశాలలను నిర్మించారు. కానీ ఉద్యోగాల కోసం లంచాలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు కావాలంటే లంచాలు చెల్లించాల్సిన ఏకైక రాష్ట్రం ఇదేనని అన్నారు. కాంగ్రెస్ ముక్తి భారత్ అని బీజేపీ ప్రచారం చేస్తోందని.. అయితే తృణమూల్ ముక్తి భారత్ అని ప్రచారం చేపట్టలేదని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోమని... రాజకీయంగానే కాదు.. సిద్ధాంతాల పరంగా బీజేపీ, కాంగ్రెస్‌లకు వైరుధ్యాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం మమతా బెనర్జీ రాజకీయంగా బీజేపీపై పోరాటం చేస్తున్నారు. కానీ గతంలో రెండు పార్టీలు మిత్రులేనని అన్నారు. అటల్‌బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో మమతా బెనర్జీ మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు.