Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనటం ద్వారా దానిని మరింత బలపరిచేందుకు, వ్యవసాయ వ్యతిరేక చట్టాల రద్దుపై ఉద్యమాన్ని విస్తృతం చేసేందుకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) జాతీయ నాయకుల బృందం ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 18, 19 తేదీల్లో పర్యటించనున్నది. విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా కార్మిక, రైతు, వ్యవసాయ కార్మికులు ఆర్కె బీచ్‌లో 18న నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరవుతారు. 19న ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో 'వ్యవసాయ చట్టాలు, సమస్యలు - రైతు ఉద్యమ బలోపేతం' అంశంపై సభలో పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఒంగోలులో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బీకేయూ జాతీయ అధికార ప్రతినిధి రాకేష్ తికాయత్, ఏఐకేఎస్ అధ్యక్షులు అశోక్ ధావలే, వ్యకాస జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, కిసాన్ సభ నాయకులు బల్కరన్ సింగ్, ధర్మపాల్ సింగ్ తదితరులతోపాటు వడ్డే శోభనాద్రీశ్వరరావు, కార్మిక, రైతు సంఘాల రాష్ట్ర నేతలు సభల్లో పాల్గొంటారు.