Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గగన్‌యాన్ మిషన్‌లో సహకారానికి భారత్-ఫ్రాన్స్‌కు చెందిన అంతరిక్ష సంస్థలు గురువారం ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రధానకార్యాలయాన్ని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జియాన్ య్వెస్ లి డ్రైయిన్ సందర్శించిన నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. గగన్‌యాన్ మిషన్ ప్రయోగానికి సహాయం చేయాలని ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ పీఎన్ఈఎస్ను ఇస్రో కోరడంతో ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం భారత ఫ్లైట్ ఫిజిషియన్స్‌కు, మిషన్ కంట్రోల్ టీమ్స్‌కు ఫ్రాన్స్‌లోని సీఏడీఎంఓ కేంద్రంలో సీఎన్ఈఎస్ శిక్షణ ఇవ్వనుంది. ఫుడ్ ప్యాకింగ్, పోషకాహార కార్యక్రమం వంటి అంశాల్లోనూ భారత సిబ్బందికి సీిఎన్ఈఎస్ శిక్షణ ఇస్తుంది. గగన్ యాన్ ప్రాజెక్టును 2018 ఆగష్టులో ప్రారంభించారు. 2022లో భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత గడ్డపై నుంచి వ్యోమగ్యామలను అంతరిక్షంలోకి పంపడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.