Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిదేండ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం
- మార్చిలో 7.39 శాతంగా నమోదు
న్యూఢిల్లీ : గత ఎనిమిదేండ్లలో ఎప్పుడూ లేని విధంగా దేశంలో ధరలు ఎగిసిపడుతున్నాయి. ముఖ్యంగా చమురు, లోహాల ధరలు అమాంతం పెరగడంతో ఈ ఏడాది మార్చిలో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) ఏకంగా 7.39 శాతానికి చేరిందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం ఓ నివేదికలో వెల్లడించింది. ఇంతక్రితం ఫిబ్రవరిలో ఈ సూచీ 4.17 శాతంగా చోటు చేసుకుంది. జనవరిలోనూ 2.51 శాతంగా ఉంది. 2020 మార్చిలో అత్యల్పంగా 0.42 శాతంగా నమోదైంది. గడిచిన మాసంలో ముఖ్యంగా ముడి చమురు, పెట్రో లియం ఉత్పత్తులు, లోహాల ధరలు భారీగా పెరగడంతో ద్రవ్యోల్బణం ఎగిసిపడిం దని మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడిం చిన గణంకాల్లో పేర్కొంది. ఇంతక్రితం 2012 అక్టో బర్లో అత్యధికంగా 7.4 శాతంగా నమోదైంది. ఆ తర్వాత ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే తొలిసారి. క్రితం మార్చిలో పప్పుల ధరలు 13.14 శాతం, పండ్ల ధరలు 16.33 శాతం చొప్పున ఎగిశాయి. ఇంధనం, విద్యుత్ ధరలు 10.25 శాతం, ఎల్పిజి ధరలు 10.30 శాతం, పెట్రోల్ ధరలు ఏకంగా 18.48 శాతం చొప్పున పెరిగాయి. ప్రభుత్వ విధానాలతో దేశంలో అసలే ఆర్థిక పరిస్థితులు బాగోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతోన్న వేళ అధిక ధరలు సామాన్యులను మరింత దుర్బర పరిస్థితుల్లోకి నెట్టుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.