Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత వాతావరణ శాఖ
న్యూఢిల్లీ : ఈ ఏడాది దేశమంతా సాధారణ వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అంచనావేసింది. ఆగేయ, ఈశాన్య ప్రాంతాల్లో మినహా దేశమంతా సాధారణంగా కన్నా ఎక్కువ, సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ తాజాగా తెలిపింది. దేశంలో వర్షాలు ఏమేరకు కురుస్తాయన్నది వాతావరణ శాఖ ప్రతిఏటా ఏప్రిల్ ఒక నివేదిక విడుదల చేస్తుంది. దాంట్లో భాగంగా పై అంచనాలు విడుదలయ్యాయి. సుదీర్ఘకాల సగటు సాధారణ వర్షపాతం(ఎల్పీఏ) 88 సెం.మీలుగా ఉందని, దాంట్లో 96-104శాతం వర్షపాతం నమోదైతే దానిని సాధారణ వర్షపాతంగా వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ ఏడాది మనదేశంలో సాధారణ వర్షపాతం ఉంటుందని ప్రయివేటు వాతావరణ విభాగం 'స్కైమేట్' కూడా కొద్ది రోజుల క్రితం తన అంచనాలను వెల్లడించింది. ఎల్పీఏలో 103శాతం వర్షం కురుస్తుందని తెలిపింది. మార్చిలో నమోదైన గణాంకాల ఆధారంగా భారత వాతావరణ శాఖ పై అంచనాలు విడుదల చేసిందని అధికారులు తెలిపారు. రుతు పవనాల రాక, వాటి ప్రభావం ఎలా ఉంటుందన్నది మే నెలలో మరింత సమాచారం విడుదలవుతుందని వారు అన్నారు. ఎల్పీఏలో 96శాతం వర్షం కురుస్తుందని 2019లో వాతావరణ శాఖ అంచనావేయగా, ఆ ఏడాది రికార్డుస్థాయిలో 110శాతం కురిసింది. 2020లోనూ ఇలాగే 100శాతం అంచనావేస్తే..109శాతం కురిసింది. అలాగే ఈ ఏడాదిలోనూ అంచనా వేసినదాని కన్నా ఎక్కువ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు.