Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్టాలు రద్దు చేసేదాకా పోరాటం ఆగదు : ఎస్కేఎం స్పష్టీకరణ
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమంలో అమరులైన అన్నదాతలకి నివాళి అర్పించే చర్యల్లో భాగంగా శుక్రవారం కళాకారులు, రైతు ఉద్యమ నేతలు కుండలతో వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఇప్పటికే ఈ ఉద్యమంలో సుమారు 370మంది రైతన్నలు అమరు లైన విషయం తెలిసిందే. వారికి నివాళి అర్పించేందుకు 370కుండలతో ఢిల్లీ-రాజస్థాన్ సరిహద్దులోని షాజ హాన్పూర్ వద్ద నిరసన తెలిపారు. ఇటీవల రైతులు దేశ వ్యాప్తంగా నిర్వహించిన మిట్టి సత్యాగ్రహ కార్యక్ర మంలో భాగంగా సేకరించిన మట్టిని ఈ కుండల్లో ఉంచి ఆందోళనను తెలిపినట్టు రైతు స్వాభిమాన్ నేత యోగేంద్ర యాద్ తెలిపారు. రైతు సంబంధిత కళాకృతులు కూడా నిర్మించినట్టు ఆయన మీడియాకి తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల ఉద్యమం 141వ రోజుకి చేరింది.. రైతు అనుకూల ప్రభుత్వమని మోడీ సర్కారు గత కొద్ది కాలంగా చెబుతున్న వాదనలు పూర్తిగా ఫేక్ అని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) సమన్వయకర్త దర్శన్ పాల్ చెప్పారు. దేశంలో కరోనా పెరుగుతుంటే రైతులు ఇంత పెద్ద స్థాయిలో ఒక దగ్గర చేరి ఆందోళన చేయడమేంటని సోషల్ మీడియాలో బీజేపీ మద్దతు దారులు పోస్టులు పెడుతున్నారని అన్నారు. మరి బీజేపీ నేతలు ఎన్నికల సభలు పెద్ద ఎత్తున ఎందుకు నిర్వ హిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సాగు చట్టాల రద్దు చేసేదాకా పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు. ఘాజీపూర్, టిక్రీ, సింఘూ తదితర ప్రాంతాల్లో సాగు వ్యతిరేక చట్టాలపై పోరాడుతున్న రైతులకి కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయాలని దర్శన్ పాల్ డిమాండ్ చేశారు.