Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మమతా బెనర్జీ
కోల్‌కతా : తన ఫోన్ ట్యాపింగ్‌కు గురైందని, దీనిపై సీఐడీ దర్యాప్తుకు ఆదేశిస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈనెల 10న జరిగిన పోలింగ్‌లో కూచ్‌బెహార్‌లో సీఐఎస్ఎఫ్ కాల్పుల్లో మరణించిన నలుగురు బాధితుల మృతదేహాలతో ర్యాలీ నిర్వహించాలని మమతా బెనర్జీ పేర్కొన్నారంటూ బీజేపీ ఒక ఆడియో టేప్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో బీజేపీ ప్రచారంలో వెనబడిందని, అందుకే ఇటువంటి ఈ కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. బీజేపీ నేతలు తమ రోజువారీ సంభాషణను కూడా వినేవారని అర్థమౌతోందని అన్నారు. సీఐడీ దర్యాప్తుకు ఆదేశిస్తానని, ఇలాంటి కుట్రలకు పాల్పడేవారిని విడిచిపెట్టననీ, దీని వెనుక ఎవరు ఉన్నది తెలుసుకున్నానని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది ఏజెంట్ల సహాయంతో కేంద్ర దళాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని తనకు సమాచారం అందిందని అన్నారు. కాగా, ఆ ఆడియో క్లిప్ బోగస్ అనీ, మమతా బెనర్జీ అటువంటి సంభాషణ చేయలేదని టీఎంసీ పేర్కొంది.