Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జమ్మూకాశ్మీర్ : ఆర్మీ సోదాలను ప్రశ్నించినందుకు జమ్మూకాశ్మీర్ పోలీసులు ఒక మహిళా ప్రత్యేక పోలీసు అధికారిని అరెస్టు చేశారు. కుల్గాంలోని ఫ్రిసల్ గ్రామంలో మహిళా పోలీసు అధికారి సైమా అక్తర్ ఇంట్లో ఆర్మీ సోదాలు జరిగాయి. అయితే, దీనికి ఆ మహిళా పోలీసు అధికారి అభ్యంతరం తెలిపింది. దీంతో ఆమెను చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద అరెస్టు చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు. అలాగే, ఆమెను సర్వీసుల నుంచి కూడా తొలగించినట్టు వివరించారు. ఉగ్రవాదాన్ని కీర్తిస్తూ.. ప్రభుత్వ అధికారులను విధి నిర్వహణలో అడ్డుకున్నదనే కారణంతో ఆమెను అరెస్టు చేసినట్టు కుల్గాం పోలీసులు ట్వీట్ చేశారు. కాగా, ఈ సోదాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.