Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతన్నలు చేస్తున్న పోరాటంలో భాగంగా రిపబ్లిక్ డే రోజన ట్రాక్టర్ ర్యాలీ గందగోళాన్ని సృష్టించి...హింసాత్మక ఘటనకు కారణమైన నటుడు దీప్ సిద్దుకు బెయిల్ మంజూరు అయింది. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ అన్నదాతలు పిలుపునిచ్చిన ట్రాక్టర్ ర్యాలీని రసాభాస చేసి.. ఎర్రకోటపై జెండా ఎగురవేసేందుకు దోహదపడ్డాడని రుజువు కావడంతో ఫిబ్రవరి 9న సిద్దును హర్యానాలో పోలీసులు అరెస్టు చేసిన సంతి విదితమే. రూ. 30 వేలు విలువ చేసే...రెండు షూరిటీలతో కూడిన వ్యక్తిగత పూచీకత్తుపై ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా పాస్పోర్ట్ అధికారులకు అప్పగించాలని, విచారణ అధికారులకు సహకరించాలని ఆదేశించింది.