Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట్నా : కరోనాతో దేశం వణికిపోతోంది. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రమనే తేడాను కరోనా చూపడం లేదు. దీంతో పలు రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలను విధించాయి. బీహార్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలోకి వస్తున్న వారికి పరీక్షలు చేసేందుకు రైల్వే స్టేషన్స్ వద్ద ఆరోగ్య కార్యకర్తలను నియమించాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదేశాలు చేశారు. ఇదే క్రమంలో బుక్సార్ రైల్వే స్టేషన్లో ఆరోగ్య కార్యకర్తలను నియమించగా....పరీక్షలు చేయించుకోవాలని ప్రయాణీకులకు ఆపేందుకు యత్నించగా.. అదెందో బాంబులా...వారంతా పరుగులు లంకించుకోవడం అక్కడి వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. చిన్నా, పెద్ద, మహిళలు ..ప్రతి ఒక్కరూ ఇదే తీరుగా ప్రవర్తిస్తున్నారు.
దీనిపై ఓ అధికారి స్పందిస్తూ...రోజూ ఇదే తంతు నడుస్తుందని, పరీక్షలు చేయించుకోండని ప్రయాణీకులను మేము కోరడం...వారు మాతో వాదించడం లేదా ఇలా పరుగుపెట్టడం చేస్తున్నారని అన్నారు. అయితే ఇక్కడ ఒక మహిళా పోలీసును నియమించినప్పటికీ...అంత మంది ఒక్కసారిగా దూసుకు రావడంతో నిస్సహయతగా ఉండిపోయారన్నారు. వీరంతా పలు రాష్ట్రాల్లో వీకెండ్ కర్ఫ్యూలు విధించడంతో పాటు లాక్డౌన్ పెడతారన్న ఆరోపణలను నమ్మి..తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్న వారని తెలిపారు.
జులై నాటికి నెలకు 6 కోట్ల డోసుల ఉత్పత్తి : భారత్ బయోటెక్
న్యూఢిల్లీ : కరోనా అంతమొందించేందుకు జులై నాటికి 6 కోట్ల కోవాగ్జిన్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తామని భారత బయోటెక్ తెలిపింది. దేశీయంగా కోవాగ్జిన్ టీకాలను అభివృద్ధి చేస్తోన్న ఈ సంస్థ.. ప్రస్తుతం నెలకు కోటి మోతాదులను ఉత్పత్తి చేస్తోంది.
మే-జూన్ నాటికి వాటి సంఖ్య రెట్టింపు అవుతుందని భారత బయోటెక్ తెలిపింది. జులై- ఆగస్టు నాటికి దాదాపు 6-7 రెట్లు అధికంగా ఉత్పత్తి చేస్తామని ధీమా వ్యక్తం చేసింది.సెప్టెంబర్ నాటికి నెలకు 10 కోట్ల మోతాదుకు చేరుకుంటామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ల తయారీ నిమిత్తం ఇప్పటికే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డిబిటి) కింద హాఫ్కీన్ బయోఫార్మటిక్ కార్పొరేషన్ లిమిటెడ్-ముంబయి, ఇండియన్ ఇమ్యూనాలజికల్స్ లిమిటెడ్-హైదరాబాద్, బయోలాజికల్ లిమిటెడ్ -బులంధర్షహర్ సంస్థలకు నిధులు అందించింది. హప్సీన్ రూ. 65 కోట్లు అందించగా...6-12 నెలల్లోగా వ్యాక్సిన్లను అందించాల్సి ఉంది. మిగిలిన రెండు తయారీ సంస్థలు...ఆగస్టు నాటికి 10-15 మిలియన్ డోసుల వ్యాక్సిన్లను ఇవ్వాల్సి ఉంటుంది. నెలకు 10 కోట్ల మోతాదుల ఉత్పత్తి చేయడమన్నదీ సవాలుతో కూడుకున్నదనీ, అయితే ఉత్పత్తి వేగవంతం చేయమని అన్ని సంస్థలను కోరినట్లు బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి రేణు స్వరూప్ తెలిపారు.