Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురు రోగుల మృతి
- చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో
రాయ్‌పూర్ : కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ఆస్పత్రిలో చేరిన బాధితులను అగ్నిప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ల కోవిడ్-19 ఆస్పత్రిలో శనివారం అగ్నిప్రమాదం చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు రోగులు చనిపోయారు. 'ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఒక వ్యక్తి మంటలంటుకుని చనిపోగా, ఐదుగురు ఊపిరాడక మరణించారు' అని రాయ్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ అజరు యాదవ్ చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 'బాధితులు కోవిడ్-19 రోగులు. వైరస్ సోకటంతో ఇటీవలే ఆస్పత్రిలో చేరారు. ఒక వార్డులో విద్యుత్
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అవి ఇతర వార్డులకు వ్యాపించాయి. మంటలను ఆర్పే యంత్రాలను సకాలంలో ఎందుకు ఉపయోగించలేదో పరిశీలిస్తున్నాం. ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటాం' అని యాదవ్ చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని భవనంలోని రోగులను ఇతర ప్రాంతాలకు తరలించామన్నారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాగెల్ విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.