Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడోరోజూ రెండు లక్షలకు పైనే
- దేశంలో రికార్డు స్థాయిలో కొత్తగా 2,34,692 కేసులు,, 1341 మరణాలు
న్యూఢిల్లీ : దేశంలో ఏరోజుకారోజూ కరోనా కేసులు కొండల్లా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,34,692 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో నమోదైన గరిష్ట స్థాయి సంఖ్య ఇదే. గత మూడు రోజులుగా వైరస్ కేసులు 2 లక్షలను మించిపోతున్నాయి. శనివారం విడుదల చేసిన జాబితాలోని సంఖ్యతో కలుపుకుని ..దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,45,26,609 కేసులు పొగయ్యాయి. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 1,341 మంది మృతి చెందారు. దీంతో మొత్తంగా 1,75,649 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 16,79,740 యాక్టివ్ కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా 11,99,37, 641 డోసులు వినియోగమయ్యాయని కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 63, 729 కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో కరోనాతో అత్యధికంగా ప్రభావితమౌతున్న 11 రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో శనివారం 11.30 గంటలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ భేటీ కానున్నారు.