Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు చోట్ల ఘర్షణలు...
- రాళ్లు విసురుకున్న టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు
- సిలిగురిలో సీపీఐ(ఎం)మద్దతుదారులపై టీఎంసీ దౌర్జన్యం
కోల్‌కతా : పశ్చిమబెంగాల్లో ఐదో దశ ఎన్నికల పోలింగ్ శనివారం కొనసాగింది. పలు చోట్ల ఘర్షణలు నెలకొన్నాయి. సాయంత్రం వరకు 78.6 శాతంగా పోలింగ్ నమోదైంది. బిద్దానగర్ ప్రాంతంలోని శాంతినగర్‌లో అధికార టీఎంసీ, బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణ నెలకొంది. ఒకరిపై ఒకరు రాళ్లు, ఇటుకలు విసురుకున్నారని అధికారులు తెలిపారు. పోలింగ్ బూత్‌ల్లోకి ఓటర్లను వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. సిలిగురిలో టీఎంసీ గూండాలు రెచ్చిపోయాయి. సీపీఐ(ఎం) మద్దతుదారులపై టీఎంసీ కార్యకర్తలకు ఘర్షణకు దిగారు. నదియా జిల్లాల్లోని శాంతిపూర్‌లో ఓటు వేయకుండా వెనక్కు వెళ్లిపోవాలని కేంద్ర బలగాలు ఓటర్లపై ఒత్తిడి తెచ్చాయని టీఎంసీ ఆరోపించింది. ఉత్తర 24 పరగణాల్లోని బీజాపూర్‌లో ఓటర్లను బూత్‌లకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ప్రతిపక్షం ఆరోపించడంతో..అధికార తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య వివాదం మొదలైంది.ఆరు జిల్లాల పరిధిలోని 45 నియోజకవర్గాలకు ఈ దశలో పోలింగ్ జరుగుతుంది. ఉత్తరబెంగాల్‌కు చెందిన 13 నియోజకవర్గాలు, దక్షిణ బెంగాల్‌కు చెందిన 32 స్థానాలు ఈ దశ జాబితాలో ఉన్నాయి. రాష్ట్రంలో ఎనిమిది దశల ఎన్నికలకు గానూ ఇప్పటికే నాలుగు దశలు పూర్తయిన విషయం తెలిసిందే. ఈనెల 10న కుచ్‌బెహర్ జిల్లాలోని సీతల్‌కుచ్ నియోజకవర్గంలో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనలు నలుగురు మృతి చెందిన నేపథ్యంలో గట్టి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు.