Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కృష్ణా బోర్డుకు ప్రభుత్వం లేఖ
అమరావతి : రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తున్న కృష్ణానది యాజమాన్యం బోర్డు బృందం తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని రాష్ట్రప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. తెలంగాణా పెట్టిన అభ్యంతరాలతో ఈనెల 19, 20 తేదీల్లో కృష్ణాబోర్డు చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడుల క్షేత్రస్థాయి పర్యటనను రాష్ట్రప్రభుత్వం మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో పర్యటన వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం మరోమారు కోరింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పర్యవేక్షించే ఇంజనీర్లకు కరోనా సోకిందని కృష్ణాబోర్డుకు క్షేత్రస్థాయిలో సమాచారం ఇచ్చేవారెవరూ ఉండరని పర్యటనను వాయిదా వేసుకోవాలని ఇరిగేషన్ కార్యదర్శి జె శ్యామలరావు బోర్డుకు మరోసారి లేఖ రాసారు.