Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి :మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య విషయంలో సీనియర్ ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ రాయడం, సర్వీసు రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించడం ఆలిండియా పోలీస్ నిబంధనావళికి విరుద్ధమని రాష్ట్ర పోలీస్ శాఖ పేర్కొంది. మంగళగిరిలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీస్‌శాఖ అధికార ప్రతినిధి, డిఐజి పాల్‌రాజ్ మీడియాతో ఆదివారం మాట్లాడారు. ఎబి వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ చీఫ్‌గా వివేకానందరెడ్డి హత్య కేసులో ఆధారాలు లేకపోయినా జగన్ కుటుంబ సభ్యులను, బంధువులను అరెస్ట్ చేయాలని తీవ్ర ఒత్తిడి చేశారని చెప్పారు. కత్రిమ డాక్యుమెంట్లను సృష్టించారంటూ డిజిపిపై నిరాధార ఆరోపణలు చేశారన్నారు. అప్పట్లో వివేకా హత్య దర్యాప్తు అంతా ఎబి కనుసన్నల్లోనే జరిగిందని, ఆయన ఇచ్చిన సమాచారంతోనే నాడు చంద్రబాబు ప్రతిరోజూ మీడియాతో మాట్లాడేవారని తెలిపారు. తన వద్దనున్న కీలక సమాచారాన్ని అప్పుడే సిట్‌కు ఎబి ఎందుకు అందివ్వలేదని ప్రశ్నించారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ వివరాలను మీడియాలో బయట పెట్టడం, కృత్రిమ డాక్యుమెంట్లను సృష్టించారని ఆరోపణలు చేయడం సరైందికాదన్నారు.