Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి : మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో డిజిపి గౌతమ్ సవాంగ్, ఇతర పోలీసు ఉన్నతాధికారులపై వ్యాఖ్యలు చేయడం ఆలిండియా సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఎపి ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఎబి వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. 30 రోజుల్లోగా లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఎబి వెంకటేశ్వరరావును ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం, విచారణను బహిర్గతం చేసేలా ప్రకటనలు చేయడం సరికాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.