Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో సెకండ్ వేవ్‌లో కరోనా కోరలు చాస్తోంది. ఈ నేపథ్యంలో కరోనాపై యుద్ధం చేసేందుకు పలు సలహాలను సూచిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ లేఖ రాశారు. ఈ సూచనలను అమలు చేస్తే దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకట్టవేయవచ్చునని తెలిపారు. కరోనాను తుదముట్టించడంలో ముఖ్య పాత్ర వ్యాక్సినేషన్ అని, కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను విస్తరించాలని కోరారు. ఎన్ని టీకాలు వినియోగమయ్యాయో చూడటానికి బదులుగా టీకాలు వేసిన జనాభా శాతంపై దృష్టి సారించాలని సూచించారు. వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తి పెంచాలని, దీని నిమిత్తం ఉత్పత్తిదారులకు అవసరమైన నిధులు, లైసెన్సులు, రాయితీలను సమకూర్చాలని కోరారు.