Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చేరిక
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఆలిండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్ల కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఏఐకేఎస్ నేతలు ఆదివారం మీడియాకి వెల్లడించారు. కాగా, గత కొద్దికాలంగా ఆయన సాగు చట్టాలకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యమానికి నేతత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన దేశంలోని చాలా ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమ స్థావరాలను సందర్శించి వారి పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఆయనకి ఆదివారం కరోనా వచ్చినట్టు నిర్ధారణ అయింది. ప్రత్యేక చికిత్స నిమిత్తం సెంట్రల్ ఢిల్లీలోని ఆర్ఎంఎల్ (విల్మింగ్డౌన్) ఆసుపత్రు లో ఆయన చేరారు. అయితే, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు ఏఐకేఎస్ సీనియర్ నేత కష్ణ ప్రసాద్ మీడియాకి వెల్లడించారు. తొందరలోనే హన్నన్ మొల్ల కరోనా నుంచి కోలుకుంటారని తాము విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు