Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి ఆగ్రహం
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దేశ ప్రజానీకం ప్రాణాల కంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారమే ముఖ్యమా? అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నిం చారు. దేశంలో కరోనాతో మతుల సంఖ్య పెరుగు తున్నా పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విజృంభణతో ప్రజానీకం బెంబే లెత్తుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన అసలు ప్రధానమంత్రి మాదిరి గానే ప్రవర్తించడం లేదన్నారు. గత దశాబ్ద కాలంగా భారత్ ఎన్నడూ అనుభవిం చనంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటుందని, కార్గిల్ సమయంలో ఇండియన్ ఆర్మీకి చీఫ్ గా సేవలందించిన వేద్ మాలిక్ ట్వీట్‌కి ప్రతిస్పందనగా ఏచూరి పైవిధంగా బదులిచ్చారు. కరోనా కేసులు పెరగడంతో అతలాకుతలం అవుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని సంప్రదిస్తుంటే ఆయన మాత్రం ఎన్నికల ప్రచారంలో ఉండటం ఏంటని ప్రశ్నించారు. రోజుకి 1338 మంది కరోనా గురై మృతి చెందుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఖ్య మొత్తం కార్గిల్ యుద్ధం లో మరణించిన సైనికుల కంటే 2.5 రేట్లు అధికమని గుర్తు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా అధికంగా ఉందనే కారణంతోనే తమ పార్టీ పశ్చిమ బెంగా ల్లో బహిరంగ సభలు, ప్రత్యేక సమావేశాలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నట్టు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ కూడా ఇదే నిర్ణయం తీసుకుందని వివరించారు. అయితే, కేంద్ర హౌంశాఖ మంత్రి మాత్రం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా లేవని చెప్పడం, ఎన్నికల ప్రచారాల వల్ల కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. ఇటువంటి బాధ్యతారహిత నాయకులు ప్రధాని, హౌం మంత్రులు ఉండటం భారతీయుల దురదృష్టకరమని ఏచూరి అన్నారు. తమ రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా ఉండటంతో రెమిడిసివర్ కోసం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రధానికి ఫోన్ చేస్తే తాము బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారని చెప్పడం సరికాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్రాల సీఎంలతో పీఎం మోడీ మాట్లాడి పరిస్థితి కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి : కాంగ్రెస్
దేశంలో కరోనా విజృంభణ దష్ట్యా జాతీయ ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించాలని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ద్వారా స్పందించారు. పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ర్యాలీలపైనా నిషేధం విధించాలని కపిల్ సిబల్ సూచించారు. లేనిపక్షంలో కరోనాను కట్టడి చేయడం ఏమాత్రం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. బెంగాల్లో ఎన్నికల ర్యాలీలను తమ పార్టీ రద్దు చేస్తున్నట్టు ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ వెల్లడించారు. రోజురోజుకు కొవిడ్ ఉధృతి పెరుగుతున్నందున ఇతర రాజకీయ నాయకులు కూడా ఇదే విధంగా నడుచుకోవాలని సూచించారు.