Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : కేరళలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల్లో రెండింటికి సీపీఐ(ఎం) తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు డాక్టర్ వి.శివదాసన్, కైరాలీ న్యూస్ ఎండీ జాన్ బ్రిట్టాస్లను రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఎల్డీఎఫ్ కూటమి కన్వీనర్, పార్టీ ఇన్ఛార్జ్ సెక్రటరీ ఎ.విజయరాఘవన్ మీడియాకు తెలిపారు. రాష్ట్రానికి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులైన కె.కె.రాఘేష్ (సీపీఐ(ఎం)), వాయిలార్ రవి (కాంగ్రెస్), పి.వి.అబ్దుల్ వాహబ్ (ఐయూఎంఎల్)ల పదవీకాలం ఏప్రిల్ 21తో ముగుస్తోంది. ఈనేపథ్యంలో ఈ మూడు స్థానాలకు ఈనెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో రెండు స్థానాలకు సీపీఐ(ఎం) తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. జాన్ బ్రిట్టాస్ ప్రముఖ జర్నలిస్టుగా గుర్తింపు పొందారు. గత 30ఏండ్లుగా పాత్రికేయరంగంలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం సీఎం పినరరు విజయన్ మీడియా సలహాదారుగా ఉన్నారు. 2003నుంచి కైరాలీ న్యూస్ ఎండీగా పనిచేస్తున్నారు. ఇక మరో అభ్యర్థి డాక్టర్ వి.శివదాసన్ ఎస్ఎఫ్ఐ మాజీ జాతీయ అధ్యక్షుడు.