Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ప్రతిపక్షాల డిమాండ్
- బెంగాల్లో ఎన్నికల సభలు రద్దు చేసుకున్న కాంగ్రెస్, లెఫ్ట్
- పట్టించుకోకుండా ప్రచారంలోనే బీజేపీ పెద్దలు
- ప్రజల ప్రాణాల కంటే ప్రధానికి ఎలక్షన్ ప్రచారమే ముఖ్యమా? : ఏచూరి
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
మోడీ సర్కారు నిర్లక్ష్యంతో దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. పాజిటివ్ సంఖ్య పెరుగుతూ భయంకర పరిస్థితి ఏర్పడుతున్నది. రోజురోజూకి కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని ప్రతిపక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. కరోనా కట్టడి చేసేందుకు తాము బెంగాల్ ఎన్నికల ప్రచారంలో బహిరంగ సభలు రద్దు చేసుకున్నట్టు కాంగ్రెస్పార్టీ స్పష్టం చేసింది. సీపీఐ(ఎం) తదితర వామపక్షాలు కూడా కరోనా విజీంభణ ధృష్య్టా ఎలక్షన్ క్యాంపెయిన్ రద్దు చేసుకున్నాయి. అయితే, బీజేపీ సర్కారు పెద్దలు అపద సమయంలోనూ అలసత్వంగా వ్యవహరించడం సర్వత్రా ఆందోళన కల్గిస్తోంది. అయితే, ఇవేం పట్టని బీజేపీ పెద్దలు ప్రచారంలో మునిగితేలుతుండడం గమనార్హం.