Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని ఆర్థిక సలహామండలి సభ్యుడు నీలేష్ షా
దేశంలో కోవిడ్-19 వ్యాప్తి సమర్థవంతంగా అడ్డుకొనివుంటే, జీడీపీ వృద్ధి రెండంకెల్లో నమోదు అయ్యేదని ప్రధాని ఆర్థిక సలహామం డలి సభ్యుడు నీలేష్షా అన్నారు. కొటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆయన కోవిడ్ వ్యాప్తి అరికట్టడం కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మతపరమైన, రాజకీయపరమైన వాటితో సహా అన్ని రకాలు గా ప్రజలు గుమికూడటంపై నిషేధించాలని, భౌతికదూరం కచ్చితం గా పాటించేట్టు చేయాలని, అన్నివేళలా మాస్కులు ధరించేట్టు, శానిటేషన్, చేతులు శుభ్రపర్చుకోవటం..వంటివి అమలుజే యాలని ఆయన సూచించారు. ఒకవేళ కేంద్రం లాక్డౌన్ ప్రకటిస్తే, అది పాక్షికంగా ఉండాలే తప్ప..మునపటి తరహాలో ఉండరాదని అన్నారు. అంతేగాక సంక్షోభంతో దెబ్బతిన్న వర్గాలకు కచ్చితంగా కేంద్రం సహాయ ప్యాకేజీ ప్రకటించాలని అభిప్రాయపడ్డారు.