Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ మళ్లీ విజృంభించటమే కారణం..
- కేంద్రం విధానాలతో సంక్షోభం తీవ్రం
- ఆయా రాష్ట్రాల్లో పాక్షికంగా వర్తకవాణిజ్య కార్యకలాపాలు
- 10 నుంచి 13శాతం జీడీపీ క్షీణించే అవకాశముంది : ఆర్థిక నిపుణులు
న్యూఢిల్లీ : గత ఏడాదికన్నా తీవ్రస్థాయిలో కోవిడ్-19 వైరస్ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రభుత్వ, ప్రయివేటు కార్యకలాపాలన్నీ దాదాపు స్తంభించిపోయే పరిస్థితి నెలకొంది. వర్తకవాణిజ్య కార్యకలాపాలు పాక్షికంగా కొనసాగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అనధికారిక లాక్డౌన్లు విధిస్తున్నాయి. ప్రజల కదలికలపై స్థానికంగా అడ్డంకులు విధిస్తున్నాయి. ఇదంతా కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీని తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆర్థిక నిపుణులు అంచనావే స్తున్నారు. ఆర్థిక రికవరీ చాలావరకు దెబ్బతిన్నదని, ఇప్పటికే 10శాతం వృద్ధి పోయిందని నిపుణులు అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ 13.5శాతం వరకు క్షీణిస్తుందని నొమురా(గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్), 13శాతం క్షీణిస్తుందని జేపీ మోర్గాన్, 10శాతం క్షీణిస్తుందని యూబీఎస్, 11.5శాతం క్షీణిస్తుందని సిటీ బ్యాంక్ అంచనాలు విడుదల చేశాయి.
కరోనాకు ముందే దెబ్బతిన్నాం..
2019 డిసెంబరులో కరోనా దేశంలోకి ప్రవేశించేనాటికే, మనదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత ఆరేండ్లుగా కేంద్రం అనుస రిస్తున్న విధానాలు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేశాయని, ఆర్థికమాంద్యంలో కూరుకుపోయామని వారు చెప్పారు. అయితే ఇదంతా కూడా రాజకీయంగా తమను వెంటాడుతుందని కోవిడ్ వైరస్ ఖాతాలో నష్టాల్ని నమోదుచేస్తున్నారని నిపుణులు అబి óప్రాయపడ్డారు. ఆర్థిక నష్టాలకు, కష్టాలకు కోవిడ్‌ను కారణంగా చూపి పాలకులు తప్పించుకుంటున్నారని వారు విమర్శించారు. కరోనా మహమ్మారి రాకముందు, 2018లో జీడీపీ వృద్ధి 6.8శాతం, 2019లో 6.5శాతం, 2020లో 4శాతం క్షీణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కోవిడ్ ప్రభావం బయటపడ్డాక.. 2020- 21లో 8శాతం వరకూ క్షీణించింది. ఇక వైరస్ వ్యాప్తిపై గత 15రోజులుగా వస్తున్న వార్తలు దేశ ప్రజలందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈనేపథ్యంలో భారత జీడీపీ గణాంకాలు వివిధ సంస్థలు ముందు ముందు సవరిస్తాయని వారు చెప్పారు.
- గత ఏడాది వైరస్ వ్యాప్తి చెందిన తీరుకు..ఇప్పుటికి చాలా తేడా కనపడుతున్నది. వైరస్ వ్యాప్తి రెండింతలైంది.
- రాబోయే వారాల్లో పరిస్థితి నియంత్రణలోకి రాకపోతే..ఆర్థికరంగం కుప్పకూలుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాలపై ప్రభావం ఎక్కువగా ఉంది. ఈరాష్ట్రాల్లో గత ఏడాదికన్నా..ఈసారి ఆర్థిక సేవలు, పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
- మహారాష్ట్రలో పూర్తిస్థాయి లాక్డౌన్ ప్రకటిస్తే..దేశజీడీపీలో 15శాతం క్షీణిస్తుందని 'క్రెడిట్ సూస్సే' తెలిపింది.