Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఊటీ : కరోనా నిబంధనలతో తమ జీవనోపాధి దెబ్బతిన్నదని, ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ ఊటీలో పడవ కార్మికులు ఆందోళనకు దిగారు. ఊటీ లేక్, బోట్ హౌస్ వద్ద మంగళవారం నిరసన నిర్వహించారు. గత ఏడాది లాక్డౌన్ కారణంగా ఇప్పటికే ఆర్థికం నష్టపోయామని, దీనికి తోడు మంగళవారం నుంచి ఆకస్మాత్తుగా బోట్ హౌస్‌ను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, బోట్‌హౌస్‌లో దశాబ్దల నుంచి పని చేస్తున్నా పర్మినెంట్ చేయలేదని ఈ సందర్భంగా వెల్లడించారు. లాక్డౌన్ కాలానికి కనీస వేతనాన్ని జిల్లా అధికారులు కానీ, పర్యాటక శాఖ కానీ అందచేయాలని డిమాండ్ చేశారు.