Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ శాఖలకు సీవీసీ ఆదేశం
న్యూఢిలీ : ఉద్యోగులపై అవినీతి ఆరోపణలపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఆదేశించింది. అవినీతి ఫిర్యాదులపై సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో సివిసి ఆదేశాలు జారీ చేసింది. అలాగే చర్యలు తీసుకోబడిన ఉద్యోగుల రికార్డుల్లో వివరాలను అప్డేట్ చేయాలని తెలిపింది. అనామక ఫిర్యాదులను, మారుపేరుతో వచ్చిన ఫిర్యాదులను కూడా నమోదు చేయాలని పేర్కొంది.