Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగు చట్టాలు తక్షణమే రద్దు చేయాలని పునరుద్ఘాటన
- ఏప్రిల్ 24 తర్వాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం : ఎస్కేఎం
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
సాగువ్యతిరేకచట్టాలపై ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తున్న రైతులడిమాండ్లను ఏమాత్రం పరిష్కరించకుండా కరోనా విజృంభణ పేరుతో అన్నదాతల ఉద్యమ స్థలిని ఎత్తివేస్తే ఎంతమాత్రం ఊరుకునేది లేదని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) స్పష్టం చేసింది. మంగళవారం ఈ మేరకు ఎస్కేఎం నేతలు ప్రకటన చేశారు. మోడీ ప్రభుత్వం ఈ విషయంలో నిరంకుశంగా వ్యవహారిస్తే తాముమళ్ళీ ఢిల్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం ఆ మూడు సాగు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి, కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేసారు. ప్రస్తుతం కొంతమంది రైతులు తమ పంట సాగు సంబంధిత అవసరాల నిమిత్తం ఇంటికి వెళ్ళారని చెప్పారు. ఏప్రిల్ 24 తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా రూపొందించిన చట్టాలపై రైతులు ఉద్యమాన్ని ప్రారంభించి 150 రోజులైంది.
ఈ సందర్భంగా ఆలిండియా కిసాన్ మజ్ధూర్ సంఘటన్ ప్రధాన కార్యదర్శి ఆశిష్ మిట్టల్ మాట్లాడుతూ... బెదిరింపు ధోరణలు, బలవంతంగా తమ ఉద్యమ స్థలి తొలగిస్తే రైతుల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే మరింత నిరంకుశంగా వ్యవహరించేందుకు కేంద్రం ఎత్తుగడలు వేస్తున్నట్టు చెప్పారు. ఈ విషయంలో తామంతా ఐక్యంగా ఉండి కుట్రలను తిప్పికొడతామన్నారు.