Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో
న్యూఢిల్లీ : దేశంలో నెలకొన్న ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనాలంటే సార్వజనీన, మూకుమ్మడి వ్యాక్సినేషన్ కార్యక్ర మం తప్పనిసరని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో పేర్కొంది. సోమవారం కేంద్రం కొత్త వ్యాక్సిన్ విధానాన్ని ప్రకటించింది. ప్రభుత్వమే సృష్టిం చిన ఈఆరోగ్య సంక్షోభం నుంచి బయట పడేయాల్సిన బాధ్యతను విడనాడేందుకు చేసే ప్రయ త్నంగా ఈ విధానం వుందని పొలిట్‌బ్యూరో విమర్శిం చింది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వాలపైకి బాధ్యతలను నెట్టివేసే ప్రయత్నమే ఇదని పేర్కొంది. వ్యాక్సిన్ సరఫరాలను పెంపొందించకుండా, అమ్మకాలను సరళీకరించడానికి, ధరలపై నియంత్రణను ఎత్తివేయ డానికి మాత్రమే ఈ విధానం ఉద్దేశించబడిందని పేర్కొంది. కేంద్రం తన బాధ్యతలను విడనాడేందుకు ఉద్దేశించిన, వివక్షతో కూడిన, సమానత్వం లేని, ప్రమాదకరమైన విధానాన్ని పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండిస్తోంది. ఈ విధానం, ప్రజలు ఎదుర్కొంటున్న మహమ్మారిని తగ్గించేందుకు లేదా ప్రజారోగ్య అత్య వసర పరిస్థితులను పరిష్కరించేందుకు ఉపయోగపడదని స్పష్టం చేసింది. అందుకు విరుద్ధంగా, వివక్షాయుత విధానంతో భారత్‌లో మరింతగా మహమ్మారి పెచ్చరిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అవసరమైన వ్యాక్సిన్ సరఫరాలను తగినంత స్థాయిలో పెంచుకోవడానికి కేంద్రం గత ఏడాది కాలంగా ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ప్రాణాలను కాపాడేటువంటి ఈ వ్యాక్సిన్‌ను తీసుకోలేని కోట్లాదిమంది ప్రజలను పక్కకు నెట్టడానికి ఇదొక విధానమని విమర్శించింది. పైగా, వ్యాక్సిన్లు ఇప్పటివరకు రాష్ట్రాలకు ఉచితంగా అందుతున్నాయి. కానీ ఇప్పుడు, ఎలాంటి ధరల నియంత్రణ లేకుండా బహిరంగ మార్కెట్లో రాష్ట్రాలు వ్యాక్సిన్లను సమకూర్చుకోవాల్సి వుంటుంది. తాజా విధానం ప్రకారం, వ్యాక్సిన్ సరఫరాదారులు తమకు అనువైన ధరలను నిర్దేశించుకోవచ్చు. దీనివల్ల మళ్ళీ ప్రజల్లో మెజారిటీ మందిని మినహాయించే పరిస్థితి వుంటుంది. వ్యాక్సిన్లను సమకూర్చుకునేందుకు కేంద్ర కోశాగారం నుంచి రాష్ట్రాలకు నిధులు అందచేయాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది.