Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఏడబ్ల్యూయూ కార్యవర్గం నిర్ణయం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఈ నెల 30న ఆందోళనలు చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. వర్చువల్గా ఆ సంఘం జాతీయ కార్యవర్గ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.విజయరాఘవన్, బి.వెంకట్ మీడియాకు వెల్లడించారు. ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం నిరుత్సాహపరిచిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితికి పరిష్కారం చూపే చర్యలు ఒక్కటి కూడా లేవని విమర్శించారు.
అందరికీ వ్యాక్సినేషన్, ఉచిత రేషన్, ఉపాధిహామీ పని, ఉచిత కరోనా పరీక్షలు, పేదలకు రూ.7,500 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న ఆందోళన జరుగుతుందని తెలిపారు. అందరికీ ఉచిత వ్యాక్సిన్ అందించాల్సిన బాధ్యత నుంచి కేంద్రం తప్పుకోవడం దారుణమన్నారు. రాష్ట్రాలు వ్యాక్సిన్ డిమాండ్ చేస్తున్నాయని, కేంద్రం సరైన సమయంలో ఇవ్వటం లేదని విమర్శించారు.