Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఫ్రాన్స్ ఆంక్షలు విధించింది. భారత నుంచి వచ్చే ప్రయాణికులు 10 రోజుల క్వారంటైన్ ఉండాలని ఆదేశించింది. ఆరోగ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉండటంతో కొన్ని దేశాల ప్రయాణీకులపై ఆంక్షలు కఠినతరం చేస్తున్నట్టు ఫ్రాన్స్ ప్రభుత్వం తెలిపింది. ఈ జాబితాలో భారత్‌ను కూడా చేర్చినట్లు తెలిపింది. కాగా, ఇంగ్లంగ్ వెళ్లే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎయిరిండియా బుధవారం ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచి 30 వరకు భారత్-యూకే మధ్య విమానాలు రద్దు చేస్తున్నట్లు ట్వీట్ చేసింది. 'భారత్, యూకే మధ్య ప్రయాణించే ప్యాసింజర్లకు గమనిక.. యూకే ఇటీవల ప్రకటించిన ఆంక్షల నేపథ్యంలో ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30 వరకు బ్రిటన్‌కు విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నాం. అయితే 24-30 తేదీల్లో ఢిల్లీ, ముంబయి నుంచి ఇంగ్లండ్‌కు వారానికి ఒక విమానాన్ని నడిపేందుకు ప్రణాళికలు చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తాం''అని ఎయిరిండియా ట్వీట్ చేసింది.