Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీకి ప్రియాంక సూచనలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా నివారణకు మన్మోహన్ సింగ్ ఇచ్చిన సలహాలను వినాలని, పబ్లిక్ రిలేషన్ ఎక్సర్సైజ్లు మానుకోవాలని ప్రధాని మోడీకి కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ విజ్ఞప్తి చేశారు. కేంద్ర నిర్లక్ష్య ధోరణి, ప్రణాళిక లోపం వల్లే దేశంలో ఆక్సిజన్, కొవిడ్ టీకాలు, రెమ్డెసివిర్ కొరత ఏర్పడిందని విమర్శించారు. కరోనా ఉద్ధతితో పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే. కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉందని ఆమె ఆరోపించారు. మందులు, ఆసుపత్రులు అందుబాటులో లేక ప్రజలు ఏడుస్తుంటే.. కేంద్ర నాయకులు మాత్రం ఎన్నికల ప్రచార సభల్లో నవ్వుతూ కన్పిస్తున్నారని అన్నారు. 'ఆక్సిజన్ లేక, ఆసుపత్రుల్లో పడకలు దొరకక, మందులు అందక ప్రజలు ఏడుస్తున్నారు. సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ వారు(బిజెపి నేతలు) ఇప్పుడు కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. పెద్ద పెద్ద ర్యాలీలు పెట్టి నవ్వుతూ మాట్లాడుతున్నారు. అలా ఎలా చేయగలుగుతున్నారు?' అని ఆమె విమర్శించారు.