Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వాణిజ్య ప్రతినిధి
ఇటీవల కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో బ్యాంక్‌ల్లోని సిబ్బంది కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ ఖాతాదారులకు కీలక సూచనలు చేసింది. తప్పనిసరి అయితే తప్పా బ్యాంక్ శాఖలకు రావొద్దని ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాశ్ మిశ్రా విజ్ఞప్తి చేశారు. ఖాతాదారులు తమ లావాదేవీల కోసం బ్యాంక్ డిజిటల్ వేదికలను ఉపయోగించుకోవాలని సూచించారు. యోనో, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవాలన్నారు. ఖాతాదారులకు సాధ్యమైనంత వరకు తాము కూడా ఇబ్బందులను తగ్గించే పనిలో ఉన్నామన్నారు. ''డిజిటల్ సేవలను వాడుకుందాం.. ఇంట్లోనే ఉందాం.. కరోనాను ఎదుర్కొందాం'' అని మిశ్రా పిలుపునిచ్చారు.